మా గురించి
దృష్టి
పేద, ధనిక భేదం లేకుండా అగ్నికుల క్షత్రియ కుటుంబాలందరూ ఒకే వేదికపై ఐక్యమత్యంగా ఉంటూ, మన జాతి ఔన్నత్యాన్ని కాపాడుకునే బలమైన సమాజం.
లక్ష్యం
• మన కుల సభ్యుల విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన మరియు నైపుణ్యాభివృద్ధికి తోడ్పడటం • అవసరంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం • రాజకీయ, సామాజిక రంగాలలో మన ఐక్యతను చాటడం • వనభోజనాలు వంటి కార్యక్రమాల ద్వారా కుటుంబాలను ఒకచోట చేర్చడం
మా ప్రస్థానం
స్థాపన: 26-11-2000 రిజిస్ట్రేషన్ నెం.: 978/2017 కార్యాలయం: బ్లాక్ నెం. 72/28, రాజీవ్ గృహకల్ప, చందానగర్, హైదరాబాద్ - 50 గ్రేటర్ హైదరాబాద్ అంతటా 14 జోన్లలో 52 మంది జోన్ ఇన్ఛార్జ్లు సంఘ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు.
అగ్నికుల క్షత్రియులు – మన వారసత్వం
మూలం
అగ్నికుల క్షత్రియులు తమ మూలాన్ని పరశురాముని కాలం నాటి ఒక ప్రాచీన గాథతో ముడిపెడతారు. సంప్రదాయం ప్రకారం, రాజస్థాన్లోని అబు పర్వతంపై జంబు మహర్షి నిర్వహించిన అగ్ని హోమం ద్వారా, రాజ్యపాలన కోసం ఒక వైష్ణవ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములతో ఈ శాఖ ఏర్పడింది. అగ్ని నుండి ఉద్భవించిన వారు కనుక "అగ్నికుల క్షత్రియులు" అనే పేరు వచ్చింది. వీరిని "వైష్ణవ బ్రాహ్మణ రాజులు" అని కూడా అంటారు. తమిళనాడులో వన్నియర్ (వన్నికుల క్షత్రియులు) పేరుతో కనిపిస్తారు.
చరిత్ర
పల్లవ, చోళ, చాళుక్య, చేర, శాతవాహన, ఇక్ష్వాకు, విష్ణుకుండిన, కదంబ, రాష్ట్రకూట వంటి అనేక రాజవంశాలతో తమకు సంబంధం ఉందని సంఘ సంప్రదాయం చెబుతుంది. సూర్య, చంద్ర వంశీయులుగా కంచి, మహాబలిపురం, తంజావూరు, మదురై కేంద్రాలుగా తెలుగు, తమిళ, కన్నడ, ఒడిశా ప్రాంతాలను పాలించినట్లు చెప్పుకుంటారు. సంస్కృతానికి అధికార భాషగా ప్రాధాన్యం ఇవ్వడం, మహాభారతం వంటి గ్రంథాలను తెలుగులోకి అనువదింపజేయడం, వందలాది దేవాలయాలు నిర్మించి వేల ఎకరాల భూములు దానం చేయడం వీరి కీర్తిగా చెప్పబడుతుంది. నౌకా నిర్మాణం, సముద్ర వ్యాపారం వీరి ప్రధాన వృత్తులు.
బ్రిటిష్ పాలకులను ఎదిరించిన కారణంగా కష్టకాలంలో తీర ప్రాంతాలకు వచ్చి, తమ రాచరిక చరిత్రను బయటపెట్టకుండా నౌకా వ్యాపారం చేసుకుంటూ జీవించారు. అందుకే ప్రాంతాన్ని బట్టి పల్లెకారి, పల్లె కాపు, పల్లె రెడ్డి వంటి వేర్వేరు పేర్లు వాడుకలో ఉన్నాయి. ఈ కాలంలోనే విద్య, ఆర్థిక పరంగా వెనుకబడ్డారు. అగ్నికుల దీపిక, అగ్నికుల ప్రకాశిక, అగ్నివంశ దీపిక, పల్లవ రాజ చరిత్ర వంటి గ్రంథాలు, ఆంధ్ర & తమిళనాడులోని శాసనాలు ఈ చరిత్రకు ఆధారాలుగా పేర్కొనబడుతున్నాయి.
ఆచార వ్యవహారాలు
అగ్నికుల క్షత్రియులకు ఉపనయనం (యజ్ఞోపవీత ధారణ) ఆచారం ఉంది — వివాహానికి ముందు ఉపనయనం చేసుకుంటారు. చాలా మంది వైష్ణవ సంప్రదాయాన్ని (నిలువు బొట్టు) పాటిస్తారు. గుడులు కట్టి విగ్రహారాధనను ఆచరణలోకి తెచ్చినవారిగా కూడా వీరిని చెప్పుకుంటారు.
నేటి పరిస్థితి
రవాణా రంగంలో రోడ్డు, వాయు మార్గాలు అభివృద్ధి చెందడంతో సాంప్రదాయ జల రవాణా, నౌకా వ్యాపారాలు తగ్గి సంఘం ఆర్థికంగా వెనుకబడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వెనుకబడిన తరగతుల్లో బీసీ-ఎ (క్రమ సంఖ్య 1) కింద రిజర్వేషన్ ఉంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో బాగా ముందుకు వెళ్తున్నా, రాజకీయ ప్రాతినిధ్యం ఇంకా తక్కువగానే ఉంది.
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ దేవాలయాలను ఈ కుల పెద్దలు నిర్మించారు. ఈ ఆలయాల ఆస్తుల పరిరక్షణ, ధర్మకర్తృత్వం అగ్నికుల క్షత్రియులకే ఉండాలని సంఘం చాలా కాలంగా కృషి చేస్తోంది.
ప్రముఖులు
- కొపనాతి కృష్ణమ్మ – అంతర్వేది ఆలయ నిర్మాత
- పినపోతు గజేంద్రుడు – వాడపల్లి ఆలయ నిర్మాత
- మల్లాడి సత్యలింగం నాయకర్ – MSN చారిటీస్ స్థాపకులు, విద్యావేత్త
జోన్ ఇన్ఛార్జ్లు – సంప్రదించవలసినవారు
బాలానగర్: తాళ్ల తిరుపతిరావు, లబ్బ జోగారావు, లబ్బ వెంకటేష్, గొరకల గోపి, తాళ్ల ధర్మారావు బోడుప్పల్: గండు ఢిల్లీరావు, శివంగి బాలరాజు, బుడత రాజు చందానగర్: దున్న యోగేశ్వరరావు, రాంబుడ్డి గణపతి, తోట ధర్మారావు, కారాగి సింహాచలం చర్లపల్లి: శివంగి జగ్గారావు, రెయ్యి కేశవరావు, కెల్ల జానకిరావు, పోతనపల్లి భాస్కరరావు, మదనాల భాస్కరరావు చింతల్: తామాడ వెంకటరమణ, మల్లేవ గురుమూర్తి, దున్న ప్రసాద్, తామాడ వాసుదేవ్ ఫిల్మ్ నగర్: మదనాల తిరుపతి, బొంగు శ్రీరాం గండి మైసమ్మ: బొడ్డు శ్రీనివాస్, తామాడ విశ్వేశ్వరరావు జీడిమెట్ల: తిమ్మల జనార్ధనరావు, తామాడ శ్రీనివాస్, దున్న మాధవరావు, కొయ్యల ధర్మరాజు, పులకల పాపారావు ఎల్బీ నగర్: పొట్టి కృష్ణారావు, సూరి జానకిరావు మల్లాపూర్: కీలు ధర్మారావు, దున్న గంగారావు, గేదెల జోగారావు, రెయ్యి సూరి, కొండగ గణేష్ మేడ్చల్: తిమ్మల హేమంత్, తిమ్మల ఆనంద్, మర్ల గోవింద్, తెప్పల ప్రశాంత్ మియాపూర్: నూకల చిరంజీవి, జుత్తు అరుణ్, గొరకల ప్రశాంత్, బయ్యా విజయకుమార్ మూసాపేట: నంది ఉమాశంకర్, సంగారు జేజేశ్వరరావు పటాన్చెరు: దున్న శ్రీను, జుత్తు జగ్గారావు, మడియా కోదండరావు, పైల ఆనందరావు, జుత్తు శివ
